న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న తెలుగు జర్నలిస్టులకు తెలంగాణ ప్రభుత్వం సాయం అందించింది. తెలుగు జర్నలిస్టులకు కరోనా వైరస్ టెస్టులు, చికిత్స కోసం మంగళవారం రూ.12 లక్షలను విడుదల చేసింది. తక్షణ సాయం కింద కరోనా పాజిటివ్ వచ్చిన ముగ్గురు జర్నలిస్టులకు రూ.75 వేల నగదును విడుదల చేసింది. అలాగే చికిత్స కోసం అవసరమైన ఆర్థిక సహాయం కూడా అందజేస్తామని వెల్లడించింది. కాగా, ఢిల్లీలో ఉన్న తెలుగు జర్నలిస్టుల పరిస్థితిపై మంత్రి కేటీఆర్ ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు.
తెలుగు జర్నలిస్టులకు తెలంగాణ ప్రభుత్వం సాయం