మా చేతగాని తనంగా తీసుకోవద్దు: సీపీ

 విజయవాడ: అరగంటలో పరిస్థితిని అదుపులోకి తీసుకొనే శక్తిసామర్ద్యాలు పోలీసులకు ఉన్నాయని విజయవాడ  నగర పోలీస్‌ కమిషనర్‌ ద్వారకా తిరుమలరావు అన్నారు. పోలీసుల శాంత స్వభావాన్ని చేతగానితనంగా భావిస్తే చర్యలు తీసుకోవగడం తప్పదని హెచ్చరించారు. ఆ పరిస్థితి తెచ్చుకోకుండా ఇంటిపట్టునే ఉండి ప్రజలు ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని సూచించారు. మొత్తం ఢిల్లీ వెళ్లిన వారు 35 మంది ఉండగా వారిలో ఏడుగురికి కరోనా వైరస్‌ పాజిటివ్, వారితో కాంటాక్ట్ అయిన 10 మందికి కరోనా సోకిందన్నారు. ఢిల్లీ వారితో ప్రైమరీ, సెకండరీ కంటాక్టు అయిన 830 మందిని గుర్తించామన్నారు. వీరందర్ని గృహ నిర్బంధంలో ఉంచి నిఘాపెట్టటం జరిగిందన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ కంటే పెద్ద సవాల్‌ని ఎదుర్కొంటున్నామని చెప్పారు. సంయమనంతో ప్రజారోగ్యాన్ని కాపాడే పనిలో ఉన్నామని మాటవినకుండా మొండికేస్తే కన్నెర్ర చేయక తప్పదంటున్నారు.  (ఏపీలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు)