ఈ క్రేజ్‌ ఇప్పట్లో తగ్గేలా లేదు!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, హీరోయిన్‌ పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం ‘అల వైకుంఠపురంలో’. అల్లు అరవింద్, ఎస్‌. రాధాకృష్ణ (చినబాబు) నిర్మించారు. ఈ సంక్రాంతికి విడులైన ‘అల వైకుంఠపురంలో’ భారీ విజయం సాధించింది. ఇందులోని పాటలు ఎంత సెన్సేషన్‌ క్రియేట్‌ చేశాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా సామజవరగమన, బుట్ట బొమ్మ పాటలు వ్యూయర్‌షిప్‌ పరంగా పలు రికార్డులు నమోదు చేశాయి. తమన్‌ అద్భుతమైన సంగీతం, బన్ని, పూజా హెగ్డే అదిరిపోయే స్టెప్పులతో పాటలు అలరిస్తాయి.