తల్లి గిరిజను కలిసిన అమృతా ప్రణయ్‌

 నల్లొండ : రాష్ట వ్యాప్తంగా సంచలన సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్‌ హత్య కేసు ఉదంతంలో అనుహ్య పరిణామం చోటుచేసుకుంది. ప్రణయ్‌ భార్య అమృత శనివారం సాయంత్రం ఆమె తల్లి గిరిజను కలిశారు. ఇటీవల అమృత తండ్రి, ప్రణయ్‌ హత్య నిందితుడు మారుతీరావు ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. కాగా మారుతీరావు అంత్యక్రియల సందర్భంగా కడసారి తండ్రిని చూసేందుకు వచ్చిన అమృతను వారి కుటుంబ సభ్యులు, స్థానికులు అడ్డుకుని వెనక్కి పంపించారు. దీంతో తండ్రిని చివరిసారి కూడా చూడకుండానే అమృత వెనుదిరిగి వెళ్లిపోయారు. మారుతీరావు ఆత్మహత్య చేసుకునే ముందు అమృతను తల్లి గిరిజ వద్దకు వెళ్లమని లేఖ రాసిన విషయం తెలిసిందే. (గిరిజా క్షమించు.. అమృత అమ్మ దగ్గరకు రా)