అబుదాబి: కరోనా వైరస్(కోవిడ్-19)... వేగంగా వ్యాపిస్తూ ప్రపంచాన్ని కుదిపేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ఇతర దేశస్తుల వీసాలు నిలిపివేస్తూ శనివారం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి17 నుంచి ఇది అమల్లోకి రానుంది. అయితే ఇదివరకే వీసా అమలుచేసిన వారికి ఈ నియమం వర్తించదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్యూహెచ్‌వో) కరోనా వ్యాప్తిని ఒక మహమ్మారిగా ప్రకటించిన నేపథ్యంలో అవసరమైతే తప్పా ప్రయాణాలు చేయోద్దని సూచించింది. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం ద్వారా కరోనా వైరస్‌ను కట్టడి చేయోచ్చని యూఏఈ పేర్కొంది. అంతేగాక అగ్రదేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా కరోనా ఈ నేపథ్యంలో కీలకి నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం దేశంలో ఎమర్జెన్సీ(నేషనల్ ఎమర్జెన్సీ) విధిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. ఇక కరోనాను అరికట్టేందుకు 50 బిలియన్ డాలర్ల నిధులు కేటాయిస్తున్నట్లు కూడా వెల్లడించారు.
కరోనా: హోం క్వారంటైన్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు